subhodayam.news
Newspaper Banner
Date of Publish : 14 April 2026, 11:58 am Digital Edition : jindham narahari

ఆర్మూర్ గాంధీ వినూత్న రీతిలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకలు

ఆర్మూర్ పట్టణంలోని సైదాబాద్ కాలనీకి చెందిన ప్రముఖ సామాజిక సేవకుడు ఆర్మూర్ గాంధీ గా పిలువబడే అబ్బులు హుస్సేన్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలు నిర్వహించారు. తన సొంత ఆటోకు అంబేద్కర్ ఫ్లెక్సీ కట్టుకుని మైక్ పెట్టుకుని అంబేద్కర్ కు సంబంధించిన పాటలతో నీలిరంగు జెండాను ఆటోకు కట్టి ప్రధాన వీధుల్లో తిరుగుతూ అంబేద్కర్ గొప్పతనాన్ని నలువైపులా చాటింపు చేశారు. ప్రచారం చేస్తున్న తీరును చూసి అందరూ అభినందించారు.