ఆర్మూర్ రంగాచారి నగర్ లోని అంగన్వాడీ కేంద్రంలో “పోషణ మాసం” నిర్వహణ..

ఆర్మూర్ : ఆర్మూర్ పట్టణంలోని 2వ వార్డులోని రంగాచారి నగర్ లో గల అంగన్వాడి కేంద్రంలో బోధకురాలు అరుంధతి ఆధ్వర్యంలో పోషణ మాసాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ నలిని మేడం మాట్లాడుతూ పిల్లల ఆరోగ్యం-దేశ భవిష్యత్తు ఈ భావనతో ప్రతి సంవత్సరం నిర్వహించే పోషణ మాసం మన సమాజానికి ఎంతో ముఖ్యమైనది. అంగన్వాడి కేంద్రాలు చిన్నారుల ఆరోగ్యానికి, గర్భిణీ స్త్రీలకు,బాలింతలకు పోషకాహారాన్ని అందిస్తూ సమాజంలో ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందిస్తున్నాయి.పోషణ మాసం ద్వారా తల్లిపాల ప్రాముఖ్యత,సమతుల్య ఆహారం, శుభ్రత,టీకాల అవసరం, రక్తహీనత నివారణ వంటి అంశాలపై అవగాహన కల్పించడం జరుగుతుంది. ఆరోగ్యవంతమైన పిల్లలు-బలమైన భారతదేశానికి పునాది.అందుకే ప్రతి కుటుంబం పోషకాహారం...