డిప్యూటేషన్ పై వెళుతున్న కార్యదర్శి రేణుకా దేవి కి సన్మానం

బాల్కొండ: బాల్కొండ మండలం కిసాన్ నగర్ గ్రామంలో గత ఐదు సంవత్సరాలుగా ఎటువంటి ఆటంకాలు లేకుండా వృత్తినే దైవంగా భావించి ధైర్యంగా గ్రామపంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహించి డిప్యూటేషన్ పై వెళుతున్న శ్రీమతి రేణుకా దేవిని స్థానిక కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు శ్రీ కనికరం గంగాధర్, డిసిసి డెలిగేట్  తమ్మె కపిల్ కుమార్, మండల ఉపాధ్యక్షులు  జక్కరాజలింగం, సీనియర్ నాయకులు  బుపి రెడ్డి వార్డు సభ్యులు పోతు సమత మరియు రాపల్లి సుమలత ఘనంగా సన్మానించడం జరిగింది.