subhodayam.news
Newspaper Banner
Date of Publish : 12 April 2026, 10:04 pm Digital Edition : Subhodayam.news Desk

హర్మూజ్ జల సంధిని దిగ్భందించండి… ట్రంప్ హకుం…!

ఇరాన్‌తో ఇటివల జరిపిన చర్చలు విఫలమైన వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ మేరకు ట్రూత్‌ సోషల్‌లో విపులంగా పోస్టు చేశారు.

తమ నౌకాదళాన్ని హర్మూజ్‌ సందిని దిగ్బంధించాలని ఆదేశించినట్టు ఈ సందర్భంగా చెప్పారు. జలసంధిలోకి నౌకలు ప్రవేశించకుండా లేదా నిష్ర్కమించకుండా అమెరికా నౌకలు అడ్డుకోవడం మొదలుపెడతాయని స్పష్టం చేశారు.

ఇరాన్‌కు అంతర్జాతీయ జలాల్లో సుంకం చెల్లించిన ప్రతి నౌకను వెంబడించి అడ్డుకోవాలని తమ నౌకాదళానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు ట్రంప్ వెల్లడించారు. చట్టవిరుద్ధమైన ఈ టోల్ చెల్లించే ఎవరికీ అంతర్జాతీయ సముద్రాలపై సురక్షితమైన ప్రయాణం ఉండబోదన్నారు.ఇరాన్‌ను సరైన సమయంలో అంతం చేయడానికి అమెరికా సిద్ధంగా ఉందని ట్రంప్ హెచ్చరించారు.