బాల్కొండ :బాల్కొండ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయం విద్యార్థులు ఆదివారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో విజయ దుందుభి మ్రోగించారు. ఈ పాఠశాల విద్యార్థులు ఏకంగా రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారు. ఇంటర్ సెకండియర్ సిఇసి విభాగంలో 969/1000 మార్కులతో ఏ ధరణి తెలంగాణ రాష్ట్ర స్థాయి 3వ ర్యాంకు, ఎం పి హెచ్ డబ్ల్యు సెకండ్ ఇయర్ లో కే రిశ్విక 981/1000 మార్కులతో రాష్ట్ర స్థాయి 15 ర్యాంకు సాధించారు. అలాగే ఫస్ట్ ఇయర్ సీఇసీ విభాగంలో 425/500 మార్కులు, ఎంపీ హెచ్ డబ్ల్యూ ప్రథమ సంవత్సరంలో విభాగంలో యు లక్ష్మీదేవి 479/500 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రత్యేక అధికారి జి భవాని ప్రత్యేక అభినందనలు తెలిపారు.