మహానీయుల స్ఫూర్తితో ముందుకు సాగాలి ఈ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ —–
జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు శనివారం ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని శ్రీరామ కాలనీ లో గల ఈ ఆర్ ఫౌండేషన్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఫౌండేషన్ చైర్మన్ రాజశేఖర్ మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఈరవత్రి రాజశేఖర్ మాట్లాడుతూ మహనీయుడు జ్యోతిరావు పూలే ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ప్రతి ఒక్కరి పైన ఉందన్నారు. విద్య యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా పెంపొందించి సమాజాన్ని మార్చి, విద్య లేకపోతే మనుగడ లేదని అందరి హృదయాల్లో స్ఫూర్తి నింపిన మహనీయులు అన్నారు. ఆ రోజుల్లో కుల వివక్షత మత వివక్షత లింగ వివక్షతలను...