జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు శనివారం ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని శ్రీరామ కాలనీ లో గల ఈ ఆర్ ఫౌండేషన్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఫౌండేషన్ చైర్మన్ రాజశేఖర్ మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఈరవత్రి రాజశేఖర్ మాట్లాడుతూ మహనీయుడు జ్యోతిరావు పూలే ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ప్రతి ఒక్కరి పైన ఉందన్నారు. విద్య యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా పెంపొందించి సమాజాన్ని మార్చి, విద్య లేకపోతే మనుగడ లేదని అందరి హృదయాల్లో స్ఫూర్తి నింపిన మహనీయులు అన్నారు. ఆ రోజుల్లో కుల వివక్షత మత వివక్షత లింగ వివక్షతలను రూపుమాపి ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచిన మహనీయుని ఆశయాల మేరకు మనమందరం నడిచిన నాడే ఆయనకు ఘన నివాళులు అర్పించిన వారి మైతమన్నారు. బహుజనులు రాజకీయంగా ఎదగాలన్న ఆయన ఆశయాల స్ఫూర్తిగా రాబోయే రోజులలో రాజకీయ దిశగా ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు కుండ రాంప్రసాద్, క్రాంతి, అంబాల ధర్మవీర్, సైఫ్, జగదీష్, నీలం శ్రీనివాస్, రాజు, భాస్కర్ తదితరులు పాల్గొని మహనీయులు జ్యోతిరావు పూలే చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.