కందకుర్తిలో శ్రీ కేశవ స్ఫూర్తి మందిరాన్ని ప్రారంభించిన ఆర్ ఎస్ ఎస్ చీఫ్ డాక్టర్ మోహన్ రావ్ భగవత్
గత వంద ఏళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిలో హైందవ సంస్కృతి, సామాజిక సేవ, ఐక్యత స్ఫూర్తి, రగిలిస్తున్న ఆర్ ఎస్ ఎస్ సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ కేశవ బలిరాం హెగ్డేవర్ అందించిన సేవలు బావి తరాలకు స్ఫూర్తి దాయకంగా ఏర్పాటు చేసిన శ్రీ కేశవ స్ఫూర్తి మందిరాన్ని ఆర్ఎస్ఎస్ సంఘ్ చాలఖ్ డాక్టర్ మోహన్ రావ్ భగవత్ శనివారం ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తిలో శ్రీ కేశవ స్ఫూర్తి మందిరాన్ని ఆర్ఎస్ఎస్ నిర్మించింది. శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ కేశవ బలిరాం హెగ్డేవర్ పూర్వీకుల సొంత గ్రామమైన కందకుర్తిలో రూ. 30 కోట్లతో ఆర్ఎస్ఎస్...