Date of Publish : 11 April 2026, 9:06 pmDigital Edition : Narendhar
కందకుర్తిలో శ్రీ కేశవ స్ఫూర్తి మందిరాన్ని ప్రారంభించిన ఆర్ ఎస్ ఎస్ చీఫ్ డాక్టర్ మోహన్ రావ్ భగవత్
గత వంద ఏళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిలో హైందవ సంస్కృతి, సామాజిక సేవ, ఐక్యత స్ఫూర్తి,రగిలిస్తున్న ఆర్ ఎస్ ఎస్ సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ కేశవ బలిరాం హెగ్డేవర్ అందించిన సేవలు బావి తరాలకు స్ఫూర్తి దాయకంగా ఏర్పాటు చేసిన శ్రీ కేశవ స్ఫూర్తి మందిరాన్ని ఆర్ఎస్ఎస్ సంఘ్ చాలఖ్ డాక్టర్ మోహన్ రావ్ భగవత్ శనివారం ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తిలో శ్రీ కేశవ స్ఫూర్తి మందిరాన్ని ఆర్ఎస్ఎస్ నిర్మించింది. శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ కేశవ బలిరాం హెగ్డేవర్ పూర్వీకుల సొంత గ్రామమైన కందకుర్తిలో రూ. 30 కోట్లతో ఆర్ఎస్ఎస్ చేపట్టిన ఈ నిర్మాణాన్ని ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలఖ్ డాక్టర్ మోహన్ రావ్ భగవత్ చేతుల మీదుగా ప్రారంభించారు.
ఆర్ఎస్ఎస్ ఏర్పాటు నేపథ్యంలో సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ కేశవ బలిరాం హెగ్డేవర్ చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తూ రూపొందించిన ఛాయా చిత్రాలను గోడలపై ఏర్పాటు చేశారు. హెగ్డేవార్ పూర్వీకుల ఇంటిని స్వయం సేవకులు 1993లో స్మృతి మందిరంగా మార్చి కేశవ శిశు మందిరం పేరిట పాఠశాల నిర్వహించారు. గతఏడాది దాని తొలగించి స్ఫూర్తి మందిర నిర్మాణ పనులు ప్రారంభించారు.
10 ఎకరాల్లో సభా ప్రాంగణం ఏర్పాటు చేశారు. ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పరిశీలించి గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. 400 మంది పోలీసులతో పాటు కేంద్ర రాష్ట్ర పారా మిలట్రీ బలగాలను సైతం కందకుర్తి లో దింపి పగడ్బందీగా బందోబస్తు ను ఏర్పాటు చేసారు.