బాల్కొండ : బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గున్నాల వెంకటేష్ గౌడ్ కిసాన్ నగర్లో ని జ్యోతిరావు పూలే గారి విగ్రహానికి వేల్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తింటి ముత్యంరెడ్డి, వైస్ చైర్మన్ గడ్డం నర్సారెడ్డి, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు .
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గున్నాల వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ సామాజిక న్యాయం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానేత జ్యోతిరావు పూలే అని ఆయన ఆశయాలు నేటి సమాజానికి దారి చూపుతాయాయని అణగారిన వర్గాల ఎదుగుదలకు, స్త్రీ విద్యాభివృద్ధికి ఆయన చేసిన పోరాటం చరిత్రలో చిరస్మరణీయంగా ఉంటుందని అన్నారు .ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.


