subhodayam.news
Newspaper Banner
Date of Publish : 09 April 2026, 7:21 pm Digital Edition : Narendhar

రాష్ట్రపతిని కలిసిన సురేష్ రెడ్డి

రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపతి ముర్మూ ను రాష్ట్రపతి భవన్ లో గురువారం బిఆర్ఎస్ పార్లమెంటరీ నాయకులు ఎంపీ కే ఆర్ సురేష్ రెడ్డి తన బృందంతో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన తన సహచర ఎంపీలతో కలిసి రాష్ట్రపతితో కొద్దిసేపు భేటీ అయ్యారు. అంతకు ముందు సురేష్ రెడ్డి రాష్ట్రపతికి గ్రీన్ చాలెంజ్ పుస్తకాన్ని బహుకరించారు. అనంతరం రాష్ట్రపతి భవన్లో బిఆర్ఎస్ ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, పార్థసారథి , మాజీ ఎంపీ సంతోష్ లతో కలిసి మొక్కలను సురేష్ రెడ్డి నాటారు.