వేల్పూర్ లో ఘనంగా గోమాతపూజ,అన్నపూజ

వేల్పూర్: వేల్పూర్ మండలంలోని శివారులో అమీనాపూర్ గ్రామం వద్ద ఉన్న శ్రీ సాయిబాబా సన్నిధిలో గురువారం సకల దేవతల ఆశీర్వాదాలను అష్టైశ్వర్యాలను ప్రసాదించే గోమాతను అందంగా అలంకరించి గోమాత పూజ చేశారు.తర్వాత భోజనాలయంలో అన్నదాతలచే అన్న పూజ నిర్వహించారు.పంచలోహాలతో కూడిన గోవిందగిరి స్వామి విగ్రహాన్ని నెలకొల్పిన ధ్యాన మందిరంలో భజన కళాకారులు భజనలు చేశారు.భీంగల్ కు చెందిన జిల్లా లక్ష్మీ రమేష్ దంపతులు, వారి కొడుకు.ఆలయ కమిటీ సభ్యులు,సాయి సేవకులు అన్న సత్రంలో సంపూర్ణ సేవలను అందించారు.ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుండి వచ్చిన భక్తులు తదితరులు పాల్గొన్నారు