మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం
శ్రీరామ్ సాగర్: మెండోరా మండల కేంద్రంలోని సావెల్ ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో బుధవారం వేల్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తింటి ముత్యంరెడ్డి,మెండోరా గ్రామ సర్పంచ్ బుట్టడి ప్రమోద్ కుమార్, ఉప సర్పంచ్ మిట్టపల్లి రాజేశ్వర్ లు కలిసి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంబించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా సకాలంలో ధాన్యం కొనుగోలు చేసి,డబ్బులు తొందరగా రైతుల ఖాతాలో జమ చేయాలని తెలిపారు.రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని,ప్రభుత్వం ప్రారంభించిన మార్క్ ఫెడ్ ద్వారా విక్రయించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సహకార సంఘం అధికారి అబ్దుల్ భారి, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, ఏవో సంధ్య రాణి,గ్రామ అభివృధి కమిటీ,...