నిజామాబాద్‌లో భారీ సైబర్ మోసం బట్టబయలు – వెలుగులోకి ₹152 కోట్ల లావాదేవీలు, 9 మంది అరెస్ట్

నిజామాబాదు జిల్లాలో నేరాల నియంత్రణలో పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ప్రత్యేక దృష్టి , శ్రద్ధ నిలుపుతూ తనదైన ముద్ర ను కనబరుస్తున్నారు. ఏ మాత్రం అవకాశం ఉన్న తన క్రింది స్థాయి పోలీసు లకు పూర్తి స్థాయీ లో ప్రోత్సాహం , సూచనలు ఇస్తూ అనేక నేరాలను కట్టడి చేస్తున్నారు. తాజా గా నకిలీ పత్రాలతో బ్యాంక్ ఖాతాలు – సైబర్ మోసగాళ్ల నెట్‌వర్క్ ను పోలీసులు చేదించారు . నిజామాబాదు పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య పర్యవేక్షణలో సైబర్ నేరాలపై పోలీసుల ప్రత్యేక ఆపరేషన్ IV టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సతీష్ మరియు సైబర్ క్రైమ్...