subhodayam.news
Newspaper Banner
Date of Publish : 07 April 2026, 2:03 pm Digital Edition : Narendhar

శభాష్ ..‌.నరేష్ !

గెలవడమే కాదు గెలిచాక తన ప్రజలు ఆరోగ్యం పై దృష్టి సారించి ఆదర్శప్రాయంగా నిలిచాడు బాల్కొండకు చెందిన ఆరో వార్డు మెంబర్ అడవల నరేష్… తన వార్డులో ప్రజలు ఎవ్వరు కూడ ప్లాస్టిక్ ప్లేట్లను, గ్లాసులను వాడి అనారోగ్యం బారిన పడకుండా వారికి అందుబాటులో తన సొంత ఖర్చుతో 400 స్టీల్ ప్లేట్లను, గ్లాసులను కొనిచ్చారు. ఈ సందర్భంగా నరేష్ ను బాల్కొండ సర్పంచ్ గాండ్ల రాజేష్, ఉప సర్పంచ్ గాండ్ల రాజేందర్ తో పాటు తోటి వార్డ్ మెంబర్లు ఘనంగా శాలువతో సత్కరించారు.