subhodayam.news
Newspaper Banner
Date of Publish : 07 April 2026, 1:01 pm Digital Edition : Narendhar

మహిళలకు మరో 40 పెట్రోల్ బంకులు!

కోటి మంది మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ‘ఇందిరా మహిళా శక్తి పథకం’ కింద ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. ప్రభుత్వం ఇప్పటికే ఇందిర మహిళా శక్తి క్యాంటీన్ లను, ఆర్టీసీ బస్సులను అందిస్తున్న సర్కార్ మహిళల కోసం పెట్రోల్ బంకులను అందించంది. సంగారెడ్డి, నారాయణపేట జిల్లాల్లోని రెండు పెట్రోల్ బంకులు లాభాలతో నడుస్తున్నాయి.

ఈ పెట్రోల్ బంకుల నిర్వహణలో సిబ్బంది, మేనేజర్లు, ఆపరేటర్లు, యజమానులందరూ మహిళలే. రాష్ట్రవ్యాప్తంగా మరో 40 మహిళా పెట్రోల్ బంకులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. స్థలాల ఎంపిక పూర్తికాగా, నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం అవుతాయి. భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్  వంటి చమురు సంస్థలతో ప్రభుత్వం ఇప్పటికే ఒప్పందాలు చేసుకుంది.

జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటికి 20 బంకులు పూర్తి చేసి ప్రారంభించే లక్ష్యంతో సర్కార్ ఉంది. ఈ దిశగా పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పలు జిల్లాలలో భూసేకరణ చేసి పెట్రోల్ బంకులను ఏర్పాటు చేయటం కోసం మహిళా సంఘాలకు ఆయా ప్రాంతాలను అధికారులు అప్పగించ నున్నారు .