ఆర్మూర్ లో హెచ్ పి వి వ్యాక్సిన్ పోస్టర్ ను ఆవిష్కరించిన 30వ వార్డ్ కౌన్సిలర్
ఆర్మూర్: పట్టణంలోని 30వ వార్డ్ కౌన్సిలర్ గుంజల పృథ్వీరాజ్ చేతుల మీదుగా అల్లు అర్జున్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ సజ్జ సాయి ఆధ్వర్యంలో హెచ్ పి వి వ్యాక్సిన్ పోస్టర్ ఆవిష్కరించారు. హెచ్ పి వి పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా 30 వార్డ్ కౌన్సిలర్ గుంజల పృధ్వీరాజ్ మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో కలుషితమైన వాతావరణం కలుషితమైన ఆహారం వలన మహిళలు అనేక ఆరోగ్యకరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా స్టెరాయిడ్ వాడిన బాయిలర్ చికెన్ తినడం వల్ల క్యాన్సర్ బారిన పడుతున్నారు. ముఖ్యంగా గర్భాశయ క్యాన్సర్ బారినపడి చాలా ఆరోగ్యకరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని ఈ హెచ్ పి వి...