ఆర్మూర్: పట్టణంలోని 30వ వార్డ్ కౌన్సిలర్ గుంజల పృథ్వీరాజ్ చేతుల మీదుగా అల్లు అర్జున్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ సజ్జ సాయి ఆధ్వర్యంలో హెచ్ పి వి వ్యాక్సిన్ పోస్టర్ ఆవిష్కరించారు. హెచ్ పి వి పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా 30 వార్డ్ కౌన్సిలర్ గుంజల పృధ్వీరాజ్ మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో కలుషితమైన వాతావరణం కలుషితమైన ఆహారం వలన మహిళలు అనేక ఆరోగ్యకరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా స్టెరాయిడ్ వాడిన బాయిలర్ చికెన్ తినడం వల్ల క్యాన్సర్ బారిన పడుతున్నారు. ముఖ్యంగా గర్భాశయ క్యాన్సర్ బారినపడి చాలా ఆరోగ్యకరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని ఈ హెచ్ పి వి వ్యాక్సిన్ తీసుకోవడంతో ఈ క్యాన్సర్ భరణి తప్పించుకోవచ్చు అని సూచించారు. కావున 9 సంవత్సరాల నిండిన మహిళలందరూ ఈ వ్యాక్సినేషన్ వేయించుకొని గర్భాశయ క్యాన్సర్ను తరిమికొట్టాలని సూచించారు. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అల్లు అర్జున్ కు వారి అభిమానులకు అభినందనలు తెలియజేశారు.ఇటువంటి మంచి కార్యక్రమంలో తనని భాగ్యస్వామ్యం చేసినందుకు అల్లు అర్జున్ అభిమానులకు అల్లు అర్జున్ నిజాంబాద్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ సాయి సజ్జకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ అభిమానులు డాక్టర్ సి పి శివరాజ్ (ఫిజియోథెరపిస్ట్ అపోలో హాస్పిటల్ ) శ్రీకాంత్ రఘు రాజ్ రోహిత్ తదితరులు పాల్గొన్నారు.