subhodayam.news
Newspaper Banner
Date of Publish : 05 April 2026, 7:35 pm Digital Edition : jindham narahari

తెలంగాణ మొదటి ఉద్యమకారుడు సతీష్ కు నివాళులర్పించిన బీఆర్ఎస్ నాయకులు

ఆర్మూర్: భారత రాష్ట్ర సమితి పార్టీ నందిపేట్ మండల సర్వసభ్య సమావేశం మండల అధ్యక్షులు మచ్చర్ల సాగర్ గారి అధ్యక్షతన నందిపేట్ మండల కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. మొదటగా అకాల మరణం చెందిన పార్టీ కార్యకర్త తెలంగాణ ఉద్యమకారుడు సతీష్ కి శ్రద్ధాంజలి ఘటించి మౌనం పాటించి నివాళులు అర్పించడం జరిగింది. వారి కుటుంబ సభ్యులకు పార్టీ తరఫున జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేసి వారికి అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది. అనంతరం పార్టీ బలోపేతం గురించి చర్చించి రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సమిష్టి కృషితో విజయం సాధించాలని వచ్చే పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ముందస్తుగా సిద్ధం కావాలని ప్రతిపక్షాల కుట్రలను తిప్పి కొట్టాలని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఇచ్చిన 42 హామీలను అమలు చేసే విధంగా ప్రజాక్షేత్రంలో గట్టిగా పోరాటం చేయాలని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించే విధంగా ప్రభుత్వంపై పోరాటం చేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ ఉల్లి శ్రీనివాస్ మాజీ ఎంపీటీసీ బాలగంగాధర్, మాజీ సర్పంచులు బాబు రాజ్, రామారావు, మురళి, ప్రవీణ్ గౌడ్, కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ హుస్నావుద్దీన్ మైనార్టీ ప్రెసిడెంట్ పాషా గ్రామ శాఖ అధ్యక్షులు భాస్కర్, శ్రీనివాస్, భూమేష్, నాగన్న, సదనంద్, నాగ రావు, గణేష్, ఉప సర్పంచ్ భరత్ వార్డు మెంబర్లు సాయిలు, నాని, రమేష్, సీనియర్ నాయకులు మచ్చర్ల పెద్ద సాయిలు, మంతెన శీను, విజయ్, అశోక్ సంతోష్ ప్రశాంత్ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.