Wednesday, June 10, 2026

సెల్ ఫోన్ కొనివ్వలేదని… తనువు చాలించిన యువకుడు

📰 Generate e-Paper Clip

నిండా 19 ఏళ్లు… కారణం చిన్నది… ముందు వెనుక ఆలోచించలేదు… తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులు… గుర్తుకు రాలేదు… వ్యసనముకు బానిసైతే మనిషి తీసుకొనే నిర్ణయం పెను విషాదాన్ని నింపుతుంది… చేతికొచ్చిన కొడుకు  కేవలం సెల్ఫోన్ కోసం విగతా జీవిగా కళ్ళ ముందు కనిపించడం ఆ కుటుంబం బాధలు వర్ణనాతీతం….మెండోరా ఎస్సై సుహాసిని తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.మెండోర మండలం లోని సోన్ పేట గ్రామానికి చెందిన పిండి మధు,వయస్సు 19 సంవత్సరాలు అనే అబ్బాయి తన తల్లిదండ్రులు సెల్ఫోన్ కొనివ్వలేదని మనస్థాపానికి గురై గడ్డిమందు త్రాగగ నిజామాబాదు మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం 5 గంటలకి చనిపోయారని , మృతుని కుటుంబీకులు ఇచ్చిన పిర్యాదు నిమిత్తం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మెండోర ఎస్సై సుహాసిని తెలిపారు.

Must Read
- Advertisement -
Latest News

“పర్యావరణ మిత్ర” జాతీయ అవార్డు గ్రహీత సేవలను అభినందించి సత్కరించిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి…

ఆర్మూర్ పట్టణంలోని రామ్ నగర్ కు చెందిన సామాజిక సేవకులు జాతీయ అవార్డు గ్రహీత పట్వారి తులసి కుమార్ ఇటీవల మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ...

More Articles Like This