ఒక్క క్లిక్ తో మీ గ్రామ పంచాయతీ సమాచారం

మీ గ్రామానికి  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎన్ని నిధులు వచ్చాయి..? ఎంత ఖర్చు పెట్టారు..? ఈ యాప్‌తో మీరు తెలుసుకోవచ్చు..గ్రామాలే దేశానికి వెన్నెముక అని అంటూ ఉంటారు. గ్రామాలు అభివృద్ది చెందినప్పుడే దేశం పురోగతి సాధించినట్లు అని చెబుతుంటారు. సరైన మౌలిక సదుపాయాలు లేని గ్రామాలు దేశంలో చాలానే ఉన్నాయి. అక్కడి ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకోక చాలా గ్రామాల్లో కరెంట్, నీళ్లు లాంటి కనీస మౌలిక సదుపాయాలు కూడా అందుబాటులో లేవు. ప్రభుత్వం గ్రామ అభివృద్దికి నిధులు కేటాయించినా.. వాటిని ఖర్చు చేయకోపోతే గ్రామస్తులకు తెలియదు. ఈ సమస్యను పరిష్కరించి నిధుల్లో పారదర్శకత తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రామ...