subhodayam.news
Newspaper Banner
Date of Publish : 03 April 2026, 9:06 am Digital Edition : PN

అక్రమ పీడీఎస్ బియ్యం పట్టివేత

శ్రీరామ్ సాగర్ :మెండోరా మండలంలోని చుట్టు ప్రక్కల గ్రామాలలో పీడీఎస్ బియ్యని సేకరించి అక్రమంగా తరలిస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు మెండోరా మండలంలోనీ దూదిగాం గ్రామ శివారులో మెండోర ఎస్సై సుహాసిని వల పన్ని పట్టుకున్నారు.గ్రామ శివారులో వాహనాలను తనిఖీ చేస్తూ నమ్మదగిన సమాచారం మేరకు ఆటోను పట్టుకుని అందులోని పిడిఎస్ బియ్యం ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న అక్రమ బియ్యాన్ని సివిల్ సప్లై వారికి అప్పచెప్పామని మెండోరా ఎస్సై సుహాసిని తెలిపారు. పిడిఎఫ్ బియ్యం అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై సుహాసిని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు..