కేంద్రం తప్పుడు కూతలపై ఎంపీ సురేష్ రెడ్డి గర్జన – కేంద్ర మంత్రి క్షమాపణకు డిమాండ్
కాలేశ్వరం ప్రాజెక్టుపై సభను తప్పుదోవ పట్టించే విధంగా కేంద్ర జల శక్తి మంత్రి సి ఆర్ పాటిల్ కూసిన తప్పుడు కూతలపై సభకు క్షమాపణ చెప్పాలని బిఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ పక్ష నేత ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి రాజ్యసభలో గర్జించారు. సభను తప్పుదోవ పట్టించిన మంత్రి క్షమాపణ చెప్పడంతో పాటు ఆయన మాటలు రికార్డులనుండి తొలగించాలని సురేష్ రెడ్డి డిమాండ్ చేశారు. మంత్రి క్షమాపణ చెప్పకపోతే తాము సభా హక్కుల ఉల్లంఘన నోటీసిస్తామని అన్నారు. ఒకప్పుడు కేంద్ర ప్రభుత్వం తమ నాయకుడు కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాలను , కాలేశ్వరం ప్రాజెక్టు వంటి వాటిని మెచ్చుకుంటూ సభలో కూర్చున్న ప్రతి ఒక్క...