హిందూ సమ్మేళనానికి ఇత్వార్ పేట్ లో ప్రచారం
బాల్కొండ : ఈ 4వ తేదీన బాల్కొండలోని ఎం కె గార్డెన్లో జరిగే హిందూ సమ్మేళనం ఆవశ్యకతను వివరిస్తూ చలో బాల్కొండ పేరిట గురువారం బాల్కొండ మండలం ఇత్వార్ పేట గ్రామము లో నిర్వాహకులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. గ్రామంలోని పలు షాపుల్లో సమ్మేళనం ఆవశ్యకతను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హిందూ సమ్మేళనం సమితి ఇన్చార్జులు సల్ల నర్సయ్య, అంబటి కిషన్, శ్రావణ్, ఇత్వార్ పేట హిందూ సమ్మేళన సమితి బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.