బాల్కొండ మండల కేంద్రంలోని దాస్ హనుమాన్ మందిరంలో హనుమాన్ జయంతి పురస్కరించుకొని గురువారం ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. పురోహితులు ప్రకాష్ జోషి ఆధ్వర్యంలో స్వామివారికి అలంకరణ అభిషేకం కార్యక్రమం జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున నైవేద్యాలు ప్రసాదాలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. హనుమాన్ గల్లి మహిళా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి సేవలో తరించారు. ఆలయ బాధ్యులు ఠాకూర్ బలరాం సింగ్, బిబిసి సాయిలు మరి కొంతమంది అన్నప్రసాధన తయారీలో పాల్గొన్నారు.