subhodayam.news
Newspaper Banner
Date of Publish : 01 April 2026, 8:32 am Digital Edition : Narendhar

హిందూ సమ్మేళనానికి వన్నెల్ బి లో ప్రచారం

బాల్కొండ: ఈనెల 4వ తేదీన బాల్కొండలోని ఎం కె గార్డెన్లో జరిగే హిందూ సమ్మేళనం ఆవశ్యకతను వివరిస్తూ చలో బాల్కొండ పేరిట బుధవారం బాల్కొండ మండలం వన్నెల్ బి గ్రామము లో నిర్వాహకులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. వన్నె ల్ బి గ్రామంలోని పలు షాపుల్లో సమ్మేళనం ఆవశ్యకతను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హిందూ సమ్మేళనం సమితి ఇన్చార్జులు సల్లా నర్సయ్య, అంబటి కిషన్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.