subhodayam.news
Newspaper Banner
Date of Publish : 31 March 2026, 12:38 pm Digital Edition : Narendhar

ఓర్పు నిబద్ధత అంకితభావంతో పనిచేయాలి- ఎస్ ఇ బి రామారావు

నిజామాబాద్: ఉద్యోగులు తమ విధుల్లో భాగంగా ఓర్పు నిబద్ధత అంకితభావం కలిగి ఉండాలని నిజామాబాద్ ఇరిగేషన్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ బి రామారావు అన్నారు. నిజాంబాద్ లోని కృష్ణ హోటల్లో జరిగిన తన పదవి విరమణ మహోత్సవంలో ప్రసంగించారు. దేశానికి వెన్నెముక ఆయన రైతులకు సేవ చేసే ఇరిగేషన్ శాఖలో ఉద్యోగం చేయడం తన అదృష్టమని, తనకు ఇష్టమని అన్నారు. ఈ పదవి విరమణ కార్యక్రమం కు ముఖ్యఅతిథిగా మాజీ ఈఎన్సీ ఎల్ రాజేశ్వర్ రెడ్డి హాజరై మాట్లాడారు. ఉద్యోగులు అందించే సేవలు సమాజానికి కలకాలం గుర్తు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఇంజనీర్ లు శంకర్, సత్యనారాయణ, జెడ్పి మాజీ చైర్మన్ విట్టల్ రావ్ పలువురు ఇంజనీర్లు పాల్గొన్నారు.