గుండె ఆపరేషన్ కు నాలుగు లక్షల LOC ఇప్పించిన సునీల్ రెడ్డి

బాల్కొండ :నను నమ్ముకున్న వారికి కష్టకాలం వచ్చినప్పుడు ఆదుకోవడంలో బాల్కొండ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ముత్యాల సునీల్ రెడ్డి ముందు వరుసలో ఉంటారు. తాజాగా మోర్తాడ్ మండలం పాలెం గ్రామానికి చెందిన యెలుమల శంకర్ కు గతంలో హార్ట్ ఎటాక్ రావడంతో హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్లో చేరడం జరిగింది. ఆయనకు గుండెలో ఇంకొక్క బ్లాక్ ఏర్పడిందని స్టంట్ వేయాలని వైద్యులు సూచించగా అందుకు ₹4లక్షలు ఖర్చు అవుతుందని తెలుపగా శంకర్ పేద కుటుంబం కావడంతో ఖర్చు బరించే స్తోమత లేనందున, వారి కుటుంబ సభ్యులు వైద్య సహాయం కొరకు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ సునీల్ కుమార్ ను సంప్రదించగా...