బాల్కొండ :మన ఊరు – మన చరిత్ర – చారిత్రాత్మక కట్టడాల సంరక్షణ ” లో భాగంగా పూర్వ అల్లకొండ ఖిల్లా అభివృద్ధి కోసం పలు తీర్మాణాలు చేయాలని అల్లకొండ (బాల్కొండ) ఖిల్లా పరిరక్షణ సమితి సోమవారం బాల్కొండ మేజర్ గ్రామ పంచాయతి పాలక మండలికి విజ్ఞప్తి చేసారు.
వివరాలు ఇలా: నిజామా బాదు జిల్లా బాల్కొండ లో 1059 లో అల్లయ్య, కొండయ్య ల చేత ఏర్పడిన ఆల్లకొండ,వల్లకొండ @ బాల్కొండ లో చరిత్రాత్మిక కట్టడాల ఖిల్లా ఉందని పూర్వ కట్టడాలపై చెట్లువల్ల పూర్వ కట్టడాలకు పగుళ్లు వచ్చి శిథిలావస్థలో ఉన్నాయని అల్లకొండ ఖిల్లా పరిరక్షణ సమితి అధ్యక్షులు బుసం సత్యనారా యణ, కార్యదర్శి,సీని యర్ జర్నలిస్ట్ బి. ఆర్. నర్సింగ్ రావు, డా,, పవన్ కుమార్, సత్వావే సంతోష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేస్తూ ఖిల్లా ను పర్యటన కేంద్రంగా తీర్చి దిద్దాలని, పూర్వ కట్టడాలను మర మత్తులు చేయాలనీ కోరుతూ గ్రామ పంచాయతీ పాలక మండలికి చెందిన సర్పంచ్ గాండ్ల రాజేష్, ఉప సర్పంచ్ గాండ్ల రాజేందర్, గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజ లింగoలకు వినతి పత్రాన్ని అంద జేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలైన అర్కరి గoగాధర్, రమేష్,జెక్క నానీ, సళ్ళ తిరుమలేస్ తది తరులు పాల్గొన్నారు.