subhodayam.news
Newspaper Banner
Date of Publish : 29 March 2026, 7:11 am Digital Edition : Narendhar

హనుమాన్ జయంతికి చురుకుగా ఏర్పాట్లు

జిల్లా వ్యాప్తంగా హనుమాన్ జయంతిని వైభవంగా నిర్వహించడానికి జిల్లాలోని అనేక హనుమాన్ మందిరాలు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నాయి. అనేక చోట్ల దేవాలయాలకు మరమ్మత్తులు రంగులు వేయిస్తున్నారు. బాల్కొండ లోని దాస్ హనుమాన్ మందిరంలో హనుమాన్ జయంతి ఏర్పాట్లు ఆఘా మేఘాల మీద జరుగుతున్నాయి. ఆలయ బాధ్యులు ఠాకూర్ బలరాం సింగ్, బిబిసి సాయిలు మరి కొంతమంది దగ్గర ఉండి జయంతి ఉత్సవాలకు ఏర్పాటు చేస్తున్నారు.