ఏప్రిల్ 3,4,5 తేదీల్లో మీ సేవ సర్వీసులు ఉండవు
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మీ సేవ కేంద్రాల్లో ఏప్రిల్ మూడో తేదీ రాత్రి 8 గంటల నుండి 5వ తేదీ ఉదయం 8 గంటల వరకు మీసేవ కేంద్రాల్లో సర్వీసులు లభించవు. మీసేవ సర్వీసులు అందించే అన్ని విభాగాల సర్వర్ల మెయింటెనింగ్ కారణంగా రాష్ట్ర శాఖ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. 36 గంటల పాటు సిటిజన్లకు మీసేవ సర్వీసులు అందుబాటులో ఉండవని సంబంధిత అధికారులు తెలిపారు