రైతులకు ఎరువుల కొరత రాకుండా చూడాలి-రాజ్యసభ సభ్యులు శ్రీ కె.ఆర్. సురేష్ రెడ్డి

​న్యూఢిల్లీ: పార్లమెంటులో జరిగిన ఫైనాన్స్ బిల్లు (Finance Bill) చర్చలో భాగంగా రాజ్యసభ సభ్యులు శ్రీ కె.ఆర్. సురేష్ రెడ్డి గారు పాల్గొని, దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు, రైతాంగ సవాళ్లు మరియు గల్ఫ్ కార్మికుల సమస్యలపై గళమెత్తారు. అంతర్జాతీయ అనిశ్చితి నెలకొన్న తరుణంలో ప్రభుత్వం అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ​రాబోయే మూడు నెలల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో, రైతులకు ఎరువుల కొరత రాకుండా చూడాలని సురేష్ రెడ్డి గారు కోరారు. యూరియా తయారీకి అవసరమైన గ్యాస్ కోసం మనం 90% విదేశాలపైనే ఆధారపడుతున్నామని, గల్ఫ్ దేశాల్లోని ఉద్రిక్తతల వల్ల సరఫరా దెబ్బతినే ప్రమాదం ఉందని...