మద్యం సేవించి వాహనం నడిపితే చర్యలు తప్పవు: SI సుహాసిని

  మెండోరా : నిజామాబాద్ మెండోరా మండల కేంద్రంలోని వివేకానంద సర్కిల్ వద్ద రోడ్డు భద్రతకు సంబంధించి "అరైవ్ అలైవ్ " కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెండోరా ఎస్సై సుహాసిని వాహనదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ఫోర్ విల్లర్ నడిపే వారు కచ్చితంగా సీట్ బెల్ట్ ని వినియోగించాలని ఆమె సూచించారు. రహదారిపై కుడి వైపునుండే ఓవర్టేక్ చేయాలని,ఎడమ వైపు వెళ్లి ప్రమాధానికి గురి కావద్దని,మద్యం సేవించి వాహనాలు నడిపితే రూపాయలు 10,000 జరిమానా లేదా జైలు...