నిజామాబాదు జిల్లాలో పెట్రోల్ , డీజిల్ కొరత లేదు ఎలాంటి వదంతులను నమ్మవద్దు : పోలీస్ కమీషనర్ వెల్లడి

నిజామాబాదు : జిల్లాలో పెట్రోల్ , డీజిల్ కొరత లేదని గౌరవనీయులు నిజామాబాదు పోలీస్ కమీషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐ.పి.ఎస్., గారు స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వదంతుల కారణంగా ప్రజలు ఆందోళనకు గురవుతూ , ఒకేసారి పెద్ద సంఖ్యలో పెట్రోల్ బంకులకు వెళ్లి వాహనాల్లో ఫుల్ ట్యాంక్ నింపించుకోవడం వల్ల అనవసర రద్దీ, అంతరాయం ఏర్పడుతున్నదని తెలిపారు. జిల్లాలోని అన్ని పెట్రోల్ బంకుల్లో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని , సరఫరా కూడా నిరంతరంగా కొనసాగుతున్నదని పేర్కొన్నారు. ఎటువంటి కొరత పరిస్థితి లేదని, ప్రజలు అవసరానికి మించి ఇంధనం నిల్వ చేసుకోవద్దని సూచించారు. అలా...