subhodayam.news
Newspaper Banner
Date of Publish : 24 March 2026, 1:36 pm Digital Edition : admin2

లయన్స్ భవనంలో కంటి వైద్య శిబిరం

బాల్కొండ : బాల్కొండ మండలం కిసాన్ నగర్ లోని లయన్స్ భవనంలో మంగళవారం బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ పుణ్యరాజు 25 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో మోతి బిందు ఉన్న వారిని గుర్తించి శస్త్ర చికిత్సల కోసం ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రికి తరలించారు. లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చాకు లింగం, జోనల్ చైర్మన్ జ్ఞాన సాగర్ రెడ్డి శిబిరంలో పాల్గొన్నారు.